![]() |
![]() |

ముంబైలో ఫిబ్రవరి 20న దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుక తారల తళుకుబెళుకుల మధ్య కన్నుల పండువగా జరిగింది. ఈ చిత్రోత్సవంలో అల్లు అర్జున్ 'పుష్ప', సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్‌షా', విక్కీ కౌశల్ 'సర్దార్ ఉధమ్' పురస్కారాలు అందుకున్నాయి. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన '83' మూవీలో కపిల్ దేవ్‌గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన రణవీర్ సింగ్ బెస్ట్ యాక్టర్, 'మిమి'లో సూపర్బ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన కృతి సనన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' మూవీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించింది.
బెస్ట్ యాక్టర్ అవార్డును పట్టుకొని ఉన్న ఫొటోను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన రణవీర్ సింగ్, "దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో 82 మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డును రిసివ్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా" అని ట్వీట్ చేశాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప మూవీ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా డిసెంబర్ 17న విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా ప్రేక్షకాదరణ పొందింది. ఒక్క హిందీ భాషలోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది పుష్ప. టైటిల్ రోల్‌లో బన్నీ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తన సినిమాకు నిన్న అవార్డు వచ్చినా ఇంతదాకా దానిపై బన్నీ స్పందించకపోవడం గమనార్హం.

విజేతల జాబితా
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ పుష్ప: ది రైజ్
బెస్ట్ యాక్టర్ - రణవీర్ సింగ్
బెస్ట్ యాక్ట్రెస్ - కృతి సనన్
బెస్ట్ డైరెక్టర్ - కెన్ ఘోష్
ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ - ఆశా పరేఖ్
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ - సతీశ్ కౌశిక్
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ - లారా దత్తా
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ - ఆయుష్ శర్మ
క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ - సర్దార్ ఉధమ్
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ - సిద్ధార్థ్ మల్హోత్రా
క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ - కియారా అద్వానీ
పీపుల్స్ చాయిస్ బెస్ట్ యాక్టర్ - అభిమన్యు దస్సానీ
పీపుల్స్ చాయిస్ బెస్ట్ యాక్ట్రెస్ - రాధికా మదన్
బెస్ట్ డెబ్యూ - అహన్ శెట్టి
బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్ - అనదర్ రౌండ్
బెస్ట్ వెబ్ సిరీస్ - క్యాండీ
బెస్ట్ యాక్టర్ ఇన్ వెబ్ సిరీస్ - మనోజ్ బాజ్‌పేయీ
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ వెబ్ సిరీస్ - రవీన్ టాండన్
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - అనుపమ
బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిజన్ సిరీస్ - షహీర్ షేక్
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ టెలివిజన్ సిరీస్ - శ్రద్ధా ఆర్య
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ టెలివిజన్ సిరీస్ - ధీరజ్ ధూపర్
మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ ఇన్ టెలివిజన్ సిరీస్ - రూపాలీ గంగూలీ
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ - పాలి
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - విశాల్ మిశ్రా
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - కనికా కపూర్
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జయకృష్ణ గుమ్మడి
![]() |
![]() |