![]() |
![]() |

'అఖండ'తో సంచలన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
బాలయ్య నటిస్తోన్న 107వ సినిమా ఇది. ఇటీవల షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య ఫోటో ఒకటి లీకైంది. ఆ ఫోటోలో బ్లాక్ షర్ట్, లుంగీ ధరించి బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించాడు. అయితే లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మూవీ టీమ్ అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. బ్లాక్ షర్ట్, లుంగీ ధరించి, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని బాలయ్య నడిచి వస్తున్న స్టిల్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇక ఈ ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. లెజెండ్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఇది ఆరంభం మాత్రమేనని, వేట మరింత క్రూరంగా ఉంటుందని మాట ఇస్తున్నానని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

గత కొన్నేళ్లలో బాలయ్య లుక్స్ పై శ్రద్ధ తీసుకున్న డైరెక్టర్ అంటే బోయపాటి శ్రీను అని చెప్పొచ్చు. ఆయన దర్శకత్వం వహించిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలలో బాలయ్య లుక్స్ కి మంచి మార్క్స్ పడ్డాయి. మిగతా దర్శకులు బాలయ్య లుక్స్ పై అంతగా శ్రద్ధ తీసుకోలేదు. అయితే డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాత్రం బాలయ్య లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్యని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు.
![]() |
![]() |