![]() |
![]() |

ఈతరం నటుల్లో రానా దగ్గుబాటిది ప్రత్యేక శైలి. కేవలం కథానాయకుడి వేషాలకే పరిమితం కాకుండా అభినయానికి ఆస్కారమున్న ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడీ టాలెంటెడ్ స్టార్. త్వరలో ఈ దగ్గుబాటి హ్యాండ్సమ్ యాక్టర్.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించబోతున్నాడు. ఆ సినిమానే.. `భీమ్లా నాయక్`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో టైటిల్ రోల్ అయిన భీమ్లా నాయక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనుండగా.. నెగటివ్ షేడ్స్ ఉన్న డేనియల్ శేఖర్ పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడు రానా. ఫిబ్రవరి 25న ఈ భారీ బడ్జెట్ మూవీ జనం ముందుకు రాబోతోంది.
Also Read: అల్లు అర్జున్ కంటే బిగ్ అని పవన్ కల్యాణ్ ప్రూవ్ చేసుకుంటాడా?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రానాకి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన `లీడర్` (2010), `ఘాజీ` (2017) వంటి తెలుగు చిత్రాలు గతంలో ఇదే ఫిబ్రవరి నెలలో రిలీజయ్యాయి. మరి.. ఆ సినిమాల సరసన `భీమ్లా నాయక్` కూడా చేరుతుందేమో చూడాలి.

కాగా, `భీమ్లా నాయక్`కి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
![]() |
![]() |