![]() |
![]() |
.webp)
క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. రీసెంట్ గా `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుని మరోసారి వార్తల్లో నిలిచిందీ పాపులర్ ప్రొడక్షన్ హౌస్. కాగా, ఈ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ నుంచి త్వరలో ఓ భారీ బడ్టెట్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమానే.. `సర్కారు వారి పాట`. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా మే 12న `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read: భీమ్లా నాయక్.. విడుదలకు వారం ముందు షూటింగ్ పూర్తి!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు సమ్మర్ సీజన్ లో వచ్చిన మైత్రీ వారి సినిమాలు మంచి విజయం సాధించాయి. 2018 సమ్మర్ కి రిలీజైన `రంగస్థలం` సెన్సేషనల్ హిట్ గా నిలవగా.. 2019 వేసవిలో విడుదలైన `చిత్రలహరి` కూడా ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో.. `సర్కారు వారి పాట` కూడా సక్సెస్ బాట పడితే.. మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో సమ్మర్ హ్యాట్రిక్ క్రెడిట్ అయినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో!
కాగా, `సర్కారు వారి పాట`ని మైత్రీతో పాటు 14 రీల్స్ ప్లస్, జి. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కూడా నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |