![]() |
![]() |

అక్కినేని నాగార్జున మాట నిలబెట్టుకున్నారు. బిగ్ బాస్ షో వేదికగా ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించిన నాగార్జున.. తాజాగా 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు. దీంతో నాగార్జునపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5 లో ఓ ఎపిసోడ్ కి ఎంపీ సంతోష్ కుమార్ గెస్ట్ గా రాగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తాను వెయ్యి ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ఎంపీ సంతోష్ కి నాగార్జున మాట ఇచ్చారు. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నారు నాగార్జున. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నాగార్జున 1080 ఎకరాల అడవిని దత్తత తీసుకొని, తన తండ్రి పేరిట అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు అక్కినేని కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

కాగా గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన తండ్రి పేరు మీద 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు.
![]() |
![]() |