![]() |
![]() |

మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సన్నాఫ్ ఇండియా'. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 18) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు హీరోలు కావాలనే తనపైనా, తన కుటుంబంపైనా ట్రోలింగ్ చేయిస్తున్నారని అన్నారు.
మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో కొంతకాలంగా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా 'మా' ఎన్నికల సమయం నుంచి ఈ ట్రోల్స్ డోస్ పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రోల్స్ పై స్పందించిన మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. "సాధారణంగా నేను ట్రోల్స్ పెద్దగా పట్టించుకోను. కానీ ఇప్పుడు ఇవి హద్దులు మీరుతున్నాయి. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది. నా మీద ఇద్దరు హీరోలు కావాలనే ట్రోలింగ్ చేయిస్తున్నారు. యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియమించుకుని మరీ నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభవిస్తారు." అన్నారు.
మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయనపై ట్రోల్స్ చేయిస్తున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు? అంటూ చర్చలు మొదలయ్యాయి.
![]() |
![]() |