![]() |
![]() |

`వకీల్ సాబ్`(2021)తో గ్రాండ్ రి-ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్వరలో `భీమ్లా నాయక్`గా సందడి చేయనున్నారు. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఫిబ్రవరి 25న జనం ముందుకు రానుంది.
Also Read: బాలయ్యతో మరోసారి మీరా జాస్మిన్!?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `వకీల్ సాబ్` తరహాలోనే `భీమ్లా నాయక్` కూడా మెగాస్టార్ చిరంజీవి లక్కీ డేట్ నే టార్గెట్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. చిరు సంచలన విజయాల్లో ఒకటైన `ఘరానా మొగుడు`(1992) విడుదలైన ఏప్రిల్ 9న `వకీల్ సాబ్` విడుదల కాగా.. ఇప్పుడు `భీమ్లా నాయక్` కూడా మరో చిరంజీవి హిట్ మూవీ రిలీజ్ డేట్ ని లక్ష్యంగా చేసుకుంది. ఆ సినిమానే.. `అల్లుడా.. మజాకా!`. 1995 ఫిబ్రవరి 25న `అల్లుడా.. మజాకా!` విడుదల కాగా.. 27 ఏళ్ళ అనంతరం ఆ తేదికే `భీమ్లా నాయక్` కూడా రాబోతోంది. మరి.. చిరుకి విజయాన్ని అందించిన తేది.. పవన్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
Also Read: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహిరి ఇకలేరు
కాగా, `భీమ్లా నాయక్`లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు.
![]() |
![]() |