![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదా పడుతుందనుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 25 నే విడుదలవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు కేవలం వారం ముందు షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.
'భీమ్లా నాయక్' షూటింగ్ పూర్తయిందని తెలుపుతూ ఆ మూవీ డైరెక్టర్ సాగర్ కె.చంద్ర గురువారం ట్వీట్ చేశాడు. షూట్ లొకేషన్ లో పవన్ తో దిగిన ఫోటోని షేర్ చేసిన సాగర్.. షూట్ పూర్తయిందని, ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ వస్తుందని తెలిపాడు. సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఇతర సినిమాల ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో ఫిబ్రవరి 25 కి వాయిదా పడింది. అయితే ఈ తేదీకి కూడా విడుదల కష్టమేనని, మరోసారి వాయిదా తప్పదని వార్తలొస్తున్న సమయంలో ఊహించని విధంగా ఫిబ్రవరి 25 నే సినిమా విడుదలంటూ ప్రకటన వచ్చింది.
విడుదలకి వారం ముందు భీమ్లా నాయక్ మూవీ పెండింగ్ షూట్ పూర్తయింది. ఈ తక్కువ వ్యవధిలో పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి, సెన్సార్ కి వెళ్లాల్సి ఉంది. ఇటీవల అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప ది రైజ్' సినిమాకి కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. విడుదల ముందు రోజు వరకు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీ ఉన్నాడు. ఆయన లేకుండానే ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మూవీ టీమ్ హిందీలో ప్రమోట్ చేసుకోవడానికి తగినంత టైం కూడా లేదు. అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. అదే మ్యాజిక్ భీమ్లా నాయక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |