![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మరపురాని చిత్రాల్లో `జెర్సీ` ఒకటి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా పలు పురస్కారాలకు చిరునామాగా కూడా నిలిచింది. కట్ చేస్తే.. ఇప్పుడీ చిత్రం హిందీలో అదే పేరుతో తెరకెక్కింది. తెలుగు వెర్షన్ ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి.. బాలీవుడ్ వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేశారు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి కానుకగా ఏప్రిల్ 14న థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగు `జెర్సీ` (2019) కూడా మూడేళ్ళ క్రితం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలోనే అప్పట్లో సందడి చేసింది. మరి.. సెంటిమెంట్ రిపీటై తెలుగు `జెర్సీ`లాగే హిందీ `జెర్సీ` కూడా ఏప్రిల్ నెల వేదికగా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read: 25 వేల కోసం 15 కిలోల వెండిని తాకట్టు పెట్టిన డైరెక్టర్!
కాగా, `జెర్సీ` హిందీ వెర్షన్ ని గీతా ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్, బ్రాట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మాతృకకి సంగీతమందించిన అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించగా.. సాచేత్ పరంపర బాణీలు సమకూర్చారు.
![]() |
![]() |