![]() |
![]() |
.webp)
రీమేక్స్ తో థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీలోనూ విజయాలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్. మరీముఖ్యంగా.. కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ వైపే మొగ్గు చూపిన వెంకీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. ఓటీటీ వేదికగా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. 2021 కాస్త వెంకీకి ఓటీటీ నామ సంవత్సరంగా నిలవడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ చిత్రం `అసురన్` ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం `నారప్ప`తో ఈ ఏడాది జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో ఎంటర్టైన్ చేసి విజయం అందుకున్న వెంకటేశ్.. నాలుగు నెలల అనంతరం మళ్ళీ నవంబర్ 25న `దృశ్యం 2`తో అదే ఓటీటీ వేదికలో సందడి చేశారు. మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం 2`కి రీమేక్ గా తయారైన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్.. వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. విశేషమేమిటంటే.. అటు `నారప్ప`, ఇటు `దృశ్యం 2`లోనూ కుటుంబం కోసం ఎంతకైనా తెగించే తండ్రి పాత్రలో వెంకీ కనిపించారు. ఏదేమైనా.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో నాలుగు నెలల వ్యవధిలో రెండు రీమేక్ మూవీస్ తో ఒకే ఓటీటీ వేదికగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని వార్తల్లో నిలుస్తున్నారు వెంకీ.
కాగా, వెంకీ తదుపరి చిత్రం `ఎఫ్ 3` వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25న రాబోతోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మాత్రం థియేటర్స్ లోనే విడుదల కానుంది.
![]() |
![]() |