![]() |
![]() |

``తగ్గేదే లే``.. అంటూ సరికొత్త మేనరిజమ్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్న చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్ - ఇండియా మూవీ తాలూకు ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్`..
డిసెంబర్ 17న థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన్ చేయనుంది. `రంగస్థలం` వంటి సంచలన చిత్రం తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటించగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ``దాక్కో దాక్కో మేక``, ``శ్రీవల్లి``, ``సామి సామి``, ``ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`` అంటూ పాటలతో యూట్యూబ్ ముంగిట హవా సాగిస్తున్న `పుష్ప - ద రైజ్` నుంచి త్వరలో మరో రెండు సర్
ప్రైజెస్ సిద్ధమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిసెంబర్ మొదటి వారంలో `పుష్ప - ద రైజ్`కి సంబంధించిన ట్రైలర్ తో పాటు సమంత ఆడిపాడిన ఐటమ్ సాంగ్ తాలూకు లిరికల్ వీడియోని
కూడా రిలీజ్ చేయబోతున్నారట. మరి.. ఈ ట్రైలర్, ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో `పుష్ప`పై ఉన్న బజ్ ని మరింతగా పెంచుతాయేమో చూడాలి.
![]() |
![]() |