![]() |
![]() |

కథానాయకుడిగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యది 12 ఏళ్ళ ప్రస్థానం. `జోష్` (2009)తో కెరీర్ ఆరంభించిన చైతూ.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఏమాయ చేసావె` (2010), `100% లవ్` (2011), `తడాఖా` (2013), `మనం` (2014), `ప్రేమమ్`(2016), `రారండోయ్ వేడుక చూద్దాం` (2017), `మజిలీ`, `వెంకిమామ` (2019), `లవ్ స్టోరి` (2021).. వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తన 12 ఏళ్ళ సినీ ప్రయాణంలో ఒక్కసారి కూడా సంక్రాంతికి సందడి చేయలేదు చైతూ. అయితే, త్వరలో ఆ ముచ్చట తీరనుంది. తన తండ్రి, కింగ్ నాగార్జునతో కలిసి నాగచైతన్య నటిస్తున్న `బంగార్రాజు` 2022 సంక్రాంతికి వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా తన బర్త్ డే కి రిలీజైన చిన బంగార్రాజు టీజర్ తో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు చెప్పకనే చెప్పిన చైతూ.. ఫస్ట్ పొంగల్ రిలీజ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, `బంగార్రాజు`ని కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తుండగా.. నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, చైతూకి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
![]() |
![]() |