![]() |
![]() |

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `ఉప్పెన`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేచురల్ స్టార్ నానికి జంటగా `శ్యామ్ సింగ రాయ్`, యువ సామ్రాట్ నాగచైతన్య సరసన `బంగార్రాజు`, యూత్ స్టార్ నితిన్ కి జోడీగా `మాచర్ల నియోజకవర్గం`, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్న కృతి.. సుధీర్ బాబు తో కలిసి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` కోసం ఆడిపాడుతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కృతి శెట్టి నుంచి రాబోతున్న తదుపరి రెండు సినిమాలు కూడా ఫెస్టివల్స్ నే టార్గెట్ చేసుకున్నాయి. కృతి కథానాయికగా నటించిన రెండో చిత్రం `శ్యామ్ సింగ రాయ్` సంగతి తీసుకుంటే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కాబోతోంది. అలాగే కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూడో సినిమా `బంగార్రాజు`.. 2022 సంక్రాంతికి వినోదాలు పంచేందుకు రెడీ అవుతోంది. మరి.. ఫెస్టివల్ స్పెషల్స్ గా మూడు వారాల వ్యవధిలో రాబోతున్న `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు`లతో మిస్ శెట్టి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |