![]() |
![]() |

శివకార్తికేయన్ టైటిల్ రోల్ పోషించిన 'డాక్టర్' మూవీ తమిళ చిత్రసీమకు బూస్ట్ నిచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. కొవిడ్ 19 మహమ్మారి దెబ్బకు కుదేలైన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రధానంగా ఎగ్జిబిషన్ సెక్టార్‌కు ఇది శుభపరిణామం. ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీ కేజేఆర్ స్టూడియోస్, "25 రోజుల నుంచి ఆడుతున్న ఈ బ్లాక్‌బస్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది, ఆనందింపజేస్తుంది! థియేటర్లలో 'డాక్టర్' అఫిషియల్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించిందని డిక్లేర్ చేయడానికి మేం సంతోషిస్తున్నాం" అని ట్వీట్ చేసింది. ఈ మూవీకి శివకార్తికేయన్ కూడా ఓ నిర్మాత.
టైటిల్ రోల్‌లో శివకార్తికేయన్ అదరగొట్టిన ఈ మూవీ అక్టోబర్ 9న హౌస్‌ఫుల్స్‌తో ఓపెన్ అయ్యి, పాజిటివ్ రివ్యూస్‌ను అందుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా, థియేటర్లలోనే ఈ సినిమాను మొదట రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన నిర్మాతలకు ఈ సినిమా అందుకు తగ్గ అద్భుత ఫలితాన్నిచ్చింది.
ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో నిర్మాతలు ప్రకటించిన తర్వాత కూడా, హ్యూమన్ ట్రాఫికింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ డార్క్ కామెడీ ఫిల్మ్ తమిళనాడు థియేటర్లలో భారీ స్థాయిలో ఇంకా ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుండటం!
'డాక్టర్' మూవీ సూపర్ సక్సెస్‌తో దీపావళికి విడుదలవుతున్న రజనీకాంత్ 'అణ్ణాత్త', విశాల్-ఆర్య 'ఎనిమీ' మూవీలపై తమిళనాడు ఎగ్జిబిటర్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.
![]() |
![]() |