![]() |
![]() |

నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత చేస్తున్న పోస్టులు ఆమె ఫాలోయర్స్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందరూ ఇప్పుడామె యాక్టివిటీస్‌ను భూతద్దం పెట్టి చూస్తున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియా పోస్టులు కూడా అందుకు మినహాయింపు కాదు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా దాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఆ పోస్ట్ ఎందుకు పెట్టిందంటూ రకరకాల డిస్కషన్స్ చేస్తున్నారు. వాటిపై కామెంట్స్ చేస్తున్నారు. తన డివోర్స్‌ను దృష్టిలో ఉంచుకొనే ఆ పోస్ట్ పెట్టిందంటూ కొన్ని పోస్టులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "మా అమ్మ చెప్పింది (MyMommaSaid)" అనే టైటిల్‌తో పోస్టులు పెడుతూ వస్తోంది. అవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె ఆ సిరీస్‌లో భాగంగా "I am strong, I am resilient, I am not perfect, I am the perfect me, I never give up, I am loving, I am determined, I am fierce, I am human, I am a warrior" అంటూ పోస్ట్ పెట్టింది.

తన గుణగణాలను ఇలా ఆమె ఏకరవు పెట్టడం చూసి, ఆమె మానసిక స్థితికి ఈ పోస్ట్ అద్దం పడుతోందని అంటున్నారు. సమంత ఫ్యాన్స్ కూడా నాగచైతన్యతో విడిపోవాల్సి రావడం మానసికంగా ఆమెను బాగా బాధపెట్టిందనీ, దానికి తోడు మీడియాలో తన గురించి రాస్తున్న, ప్రసారం చేస్తున్న విషయాలు కూడా ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయనీ అభిప్రాయపడుతున్నారు. ఆ స్థితివల్లే ఇలాంటి పోస్టులు పెడుతోందని అనుకుంటున్నారు.
విడాకుల అనంతరం సమంత ఏం చేయబోతోందన్నది తెలియకపోవడంతో, ఆమె సోషల్ మీడియా పోస్టుల గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.
![]() |
![]() |