![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన కుడి చేతి భుజానికి వైద్యులు సర్జరీ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే బాలకృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
కొంతకాలంగా కుడి చేతి భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన భుజానికి కేర్ వైద్యులు సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణకు సర్జరీ అనే వార్తతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే బాలకృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను డిశ్చార్జ్ కూడా చేయబోతున్నామని వైద్యులు తెలిపారు.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. అలాగే, గోపీచంద్ చంద్ మలినేని దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నారు.
![]() |
![]() |