Home

»

Latest News

నానికి అతిథిగా నిత్య‌!

Nov 2, 2021 3:37PM

 

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `అలా మొద‌లైంది` (2011) చిత్రంతో తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌యమైంది కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్. ఆపై ఈ ఇద్ద‌రు అదే ఏడాది రిలీజైన `సెగ‌`లో మ‌రోసారి జంట‌గా క‌నిపించారు. క‌ట్ చేస్తే.. ప‌దేళ్ళ త‌రువాత నాని, నిత్య ఇంకోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. నాని క‌థానాయ‌కుడిగా నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఓ చిత్రాన్ని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. `ద‌సరా` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. స‌మంత మ‌రో నాయిక‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే అతిథి పాత్ర ఉంద‌ట‌. ఆ వేషంలో నిత్యా మీన‌న్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే `ద‌స‌రా`లో నిత్యా మీన‌న్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. నానికి నాయిక‌గా క‌లిసొచ్చిన నిత్య‌.. అతిథిగానూ అచ్చొస్తుందేమో చూడాలి.

కాగా, ప్ర‌స్తుతం నిత్యా మీన‌న్ చేతిలో `భీమ్లా నాయ‌క్`, `స్కైలాబ్`, `గ‌మ‌నం` వంటి తెలుగు చిత్రాలున్నాయి. త‌క్కువ గ్యాప్ లోనే ఈ సినిమాల‌న్నీ జ‌నం ముందుకు రాబోతున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com