Home

»

Latest News

యాంకర్ సుమ వెండితెర రీఎంట్రీ.. అధికారిక ప్రకటన!

Nov 2, 2021 3:32PM

యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బుల్లితెర లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం. హోస్ట్ గా బుల్లితెరపై ఎన్నో షోస్, ఈవెంట్స్ తో సందడి చేస్తున్న సుమ.. చాలా కాలం తర్వాత వెండితెరపైనా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

దాసరినారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాతో సుమ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసినా.. యాంకర్ గా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆమె సినిమాలపై అంతగా ఆసక్తి చూపలేదు. అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరుస్తున్న సుమ.. ఇప్పుడు పూర్తిస్థాయి నటిగా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సుమ వెండితెర రీఎంట్రీ గురించి తాజాగా వీడియో విడుదలైంది. ఆ వీడియోలో పలువురు ఆమెని సినిమాల్లోకి వస్తున్నారంటగా అని అడగగా.. ఆమె షాక్ అవుతుంది. అంతేకాదు గతంలో పలువురు సెలబ్రిటీలు సుమ గురించి మాట్లాడిన క్లిప్స్ ను వీడియోలో చూపించారు. 'ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి.. చేసేస్తే పోలా' అంటూ సుమ తన రీఎంట్రీని కన్ఫర్మ్ చేసింది. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాం అంటూ వీడియో ముగించారు.

మరి సుమ రీఎంట్రీ ఏ సినిమాతో, ఎవరి దర్శకత్వంలో ఉంటుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com