![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రాంతీయవాదం ఆధారంగా జరిగాయనీ, అందుకే తాను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. అయితే తెలుగు సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఆయన చెప్పారు. తన రాజీనామా విషయాన్ని మంచు విష్ణుకు ఒక మెసేజ్ రూపంలో ప్రకాశ్‌రాజ్ తెలిపారు. తన రాజీనామాను యాక్సెప్ట్ చెయ్యమని రిక్వెస్ట్ చేశారు. అందుకు మంచు విష్ణు ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకాశ్‌రాజ్ తనకు చేసిన ఫోన్ మెసేజ్‌ను, అందుకు తానిచ్చిన రిప్లై మెసేజ్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు విష్ణు.
"డియర్ విష్ణు.. నీ స్టుపెండస్ విక్టరీకి అభినందనలు. 'మా'ను నడిపించడానికి అన్ని రకాల పవర్స్ నిన్ను ఆశీర్వదిస్తాయని ఆశిస్తాను. ఆల్ ద బెస్ట్. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయి. ఒక నాన్‌మెంబర్‌గా నీకు కచ్చితంగా సపోర్ట్ చేస్తాను. థాంక్యూ." అని ప్రకాశ్‌రాజ్ మెసేజ్ పెట్టారు.
అందుకు మంచు విష్ణు, "డియర్ అంకుల్, థాంక్యూ. మీ నిర్ణయంతో నేను హ్యాపీగా లేను. మీరు నాకంటే చాలా పెద్దవారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు సైడ్లు. ఆ రెండింటినీ మనం సమానంగానే చూడాలి. దయచేసి ఎమోషనల్ కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. 'మా' ఫ్యామిలీలో మీరు అంతర్గత భాగం. మీ ఐడియాస్ నాకు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, మనం మాట్లాడుకుందాం. ఐ లవ్ యూ అంకుల్, దయచేసి తొందరపడకండి." అని రిప్లై ఇచ్చారు.

విష్ణు రిప్లై ఎంతో హుందాగా ఉందనీ, ప్రకాశ్‌రాజ్ మీద అతనికి ఉన్న గౌరవాన్ని ఆ సమాధానం తెలియజేస్తోందనీ ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ప్రకాశ్‌రాజ్‌ను విష్ణు కన్విన్స్ చేసి, ఆయనను 'మా'లో ఉండేట్లు చేయగలడనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |