![]() |
![]() |

2022 సంక్రాంతికి `భీమ్లా నాయక్`గా సందడి చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రకని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరానువాదం, సంభాషణలు సమకూర్చుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా, ప్రస్తుతం ఓ భారీ ఛేజింగ్ సీన్ ని పిక్చరైజ్ పనిలో ఉందట యూనిట్. పవన్, రానా మధ్య వచ్చే ఈ సన్నివేశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారట. అంతేకాదు.. ఇంట్రవెల్ కి ముందొచ్చే ఈ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`భీమ్లా నాయక్`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన తమన్.. మరో నాలుగు రోజుల్లో సెకండ్ సింగిల్ ``అంత ఇష్టం``తో అలరించనున్నాడు. పవన్, నిత్యపై ఈ గీతాన్ని చిత్రీకరించారు.
![]() |
![]() |