![]() |
![]() |

`మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి` చిత్రాలతో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యువ సామ్రాట్ నాగచైతన్య. ఈ నేపథ్యంలో.. చైతూ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `థాంక్ యూ`పై మంచి అంచనాలు నెలకొన్నాయి. `మనం` (2014) తరువాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే.. `థాంక్ యూ`కి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`థాంక్ యూ`లో చైతూకి జోడీగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఏస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. బీవీయస్ రవి కథను అందించారు.
![]() |
![]() |