![]() |
![]() |

అందాల తార పూజా హెగ్డేని అందలమెక్కించింది తెలుగు చిత్ర పరిశ్రమే అయినా.. తొలి అవకాశమిచ్చింది మాత్రం తమిళ సినీ సీమనే. `రంగం` ఫేమ్ జీవా నటించిన సూపర్ హీరో ఫిల్మ్ `ముగమూడి`(2012)తో పూజ తన అభినయపర్వానికి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత తెలుగు, హిందీ చిత్రాలపై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు పదేళ్ళ తరువాత మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఆ సినిమానే.. `బీస్ట్`. ఇళయ దళపతి విజయ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. విజయ్ బర్త్ డే సందర్భంగా `బీస్ట్` ఫస్ట్ లుక్ రివీల్ చేసిన యూనిట్.. త్వరలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనుందట. పూజ పుట్టినరోజైన అక్టోబర్ 13న ఈ లుక్ ని ఆవిష్కరిస్తారని కోలీవుడ్ బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం పూజ చేతిలో `ఆచార్య`, `రాధేశ్యామ్`, `SSMB 28` వంటి క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరోవైపు అక్కినేని అఖిల్ తో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` విజయదశమి కానుకగా అక్టోబర్ 15న థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |