![]() |
![]() |

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో అక్టోబర్ 8న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు అఖిల్ సోదరుడు అక్కినేని నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వస్తుండడం విశేషం.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు నాగచైతన్య చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాగచైతన్య గెస్ట్ గా వస్తుండటం ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా నాగచైతన్య తన భార్య సమంతతో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల ప్రకటన తర్వాత నాగ చైతన్య పాల్గొంటున్న ఈవెంట్ ఇదే. దీంతో ఈ ఈవెంట్ లో నాగ చైతన్య ఏం మాట్లాడతాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ఆమని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |