![]() |
![]() |

సుమకు, తనకు మధ్య గ్యాప్ పెరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె భర్త రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య అప్పుడు.. ఇప్పుడు ఎలాంటి గ్యాప్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గ్యాప్ వచ్చిందంటూ సోషల్ మీడియలో వస్తున్న కథనాలకు రాజీవ్ కనకాల సోదాహరణగా వివరణ ఇచ్చారు. ఆ క్రమంలో తాము మణికొండ నుంచి ఎల్ అండ్ టీకి ఎందుకు మారాల్సి వచ్చిందో.. అలాగే మళ్లీ ఎల్ అండ్ టీ నుంచి మణికొండకు వెనక్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
నాటి హైదరాబాద్ శివారులోని మణికొండలో తాము ఇల్లు నిర్మించుకున్నప్పుడు.. తమ ఒక్కరిదే ఇల్లు అని.. ఆ తర్వాత చాలా కమర్షియల్ ఇళ్లు వచ్చాయన్నారు. అయితే నాడు తమ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. ఇంటి ఆవరణలో ఆటలాడుకుంటుంటే.. అంతా జూలోని జంతువులను చూసినట్లు చూసేవారని.. అలాగే పిల్లలకు స్కూల్ బస్సు ఎల్ అండ్ టీ నుంచి బయలుదేరుతుందని.. ఆ క్రమంలో సొంత ఇల్లు వదలాల్సి వచ్చిందన్నారు. అయితే అమ్మ చనిపోయిన తర్వాత.. నాన్న తనతోనే ఉండేవారన్నారు. అయితే మణికొండలో సొంత ఇల్లు ఖాళీ కావడం.. అక్కడ, ఇక్కడ ఇళ్ల మెయింటనెన్స్ ఖర్చు భారీగా పెరిగిపోయిందనీ, దాంతో.. తాము మళ్లీ మణికొండ రావాల్సి వచ్చిందనీ తెలిపారు. ఆ క్రమంలో తమ మధ్య గ్యాప్ పెరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయన్నారు. కానీ అందులో వాస్తవం లేదన్నారు రాజీవ్.
ఒక ప్రశ్నకు సమాధానంగా, యాంకర్‌గా సుమ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, ఆమె విజయం వెనక తాను లేనని రాజీవ్ కనకాల సుస్పష్టం చేశారు. కేవలం సుమ పట్టుదల, నేర్పరితనం, చలాకీతనం, ఎప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఉండడం.. ఇండస్ట్రీలోని పెద్దవాళ్లందరూ ఆమెకు తెలియడం.. ఇవన్నీ సుమకు అడ్వాంటేజ్ అయ్యాయని రాజీవ్ తెలిపారు. అలాగే సుమ ఎప్పటికప్పుడు నేర్చుకుంటుందన్నారు. అయితే సుమ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. సుమ ఇప్పుడు దొరికిందన్నారు. తనకు తెలిసి ఇంకా రెండు మూడు నెలలే ఉందన్నారు. తమ కుమారుడు రోషన్ కనకాల ఇండస్ట్రీలోకి ఎంటర్ అవబోతున్నాడన్నారు. అయితే అది ఏ క్రాఫ్ట్ అనేది రోషన్ చూసుకుంటాడన్నారు.
![]() |
![]() |