Home  »  News  »  చిరంజీవి ఏమిటో తెలుసు.. మా నాన్న‌కంటే పెద్ద శ‌క్తి లేదు!

Updated : Oct 5, 2021

 

మెగాస్టార్ చిరంజీవి ఏమిటో.. చిరంజీవి ఫ్యామిలీ ఏమిటో త‌న‌కు తెలుసునన్నారు హీరో మంచు విష్ణు. వేరే రాష్ట్రంలోని ఫార్మ్‌హౌస్‌లో కూర్చుని వీడియో రిలీజ్ చేసే ప్రకాశ్‌రాజ్.. "నేను 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటే ఇక్కడ మేమంతా నోరు మూసుకుని కూర్చుంటామా?" అని మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువ‌న్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న 'మా' ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై మాట్లాడారు.

ప్రకాశ్‌రాజ్ వెనక చిరంజీవి ఉన్నారని.. మీ వెనక కనపబడని శక్తి ఏదో ఉందని ప్రచారం జరుగుతోంద‌నే ప్రశ్నకు మంచు విష్ణు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. "మా నాన్న కన్న పెద్ద శక్తి ఎవరు లేరు. ఆయనే నా దేవుడు. ఆయన సపోర్టు ఉన్నంత వరకు ఎవరు ఎదురైతే నాకేమిటి" అన్నారు. ఆయన బ్లెసింగ్ లేకుండా తాను ఏదీ చేయనని స్పష్టం చేశారు. "ఓ వేళ నాకు రైట్ అనిపించింది.. నాన్న వద్దు అంటే పక్కకు తప్పుకుంటాను.. అదీ నేను నమ్మే ఫిలాసఫీ... అదీ నా పెంపకం" అంటూ మంచు విష్ణు తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.

ప్రకాశ్‌రాజ్ పోలిటికల్ యాంబిషన్స్ కోసమే.. పోటీ చేస్తూ ఉండవచ్చునని.. కానీ తనకు పోలిటికల్ యాంబిషన్స్ లేవన్నారు మంచు విష్ణు. "మా నాన్న పొలిటిషియన్, మా బావ సీఎం, నాకు అత్యంత సన్నిహితుడు కేటీఆర్" అని మంచు విష్ణు చెప్పారు. "వీరంతా పాలిటిక్స్‌లోనే ఉన్నారు... కానీ నాకు ఎందుకు పాలిటిక్స్?" అని ఆయన ప్రశ్నించారు. "పోని వాళ్ల వద్ద లబ్ది పొందితే... నా సినిమాకు కలెక్షన్స్ పెరుగుతాయా?" అని మంచు విష్ణు ప్రశ్నించారు. త‌ను యాక్టర్‌నని.. త‌న‌కు వాళ్ల అవసరం ఉండదన్నారు. పొలిటికల్ యాంబిషన్స్ ఉంటే.. ఎప్పుడో వెళ్లేవాడినని.. కానీ దీని కోసం వెళ్లవలసిన అవసరం లేదన్నారు విష్ణు. 

అయితే ఈ ఎన్నికల్లో పోటీ.. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుకా? లేక.. మోహన్ బాబు, చిరంజీవికా? అనే ప్రశ్నకు... వారిద్దరి మధ్య పోటీ ఉండదని.. వారిద్దరిది బ్యూటిఫుల్ ఫ్రెండ్‌షిప్ అని మంచు విష్ణు పేర్కొన్నారు. ఇండస్ట్రీ పెద్దలంటే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు అని ఆయన తెలిపారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. ఇండస్ట్రీని నమ్మి ఉన్నవాళ్లందరూ ఇండస్ట్రీ పెద్దలే అని ఆయన అభివర్ణించారు.

ప్రకాశ్‌రాజ్‌పై విమర్శలు లేకుండా ఉంటే.. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చునని.. కానీ ఆయన ఏకగ్రీవానికి ఏ ఒక్క నిర్మాత, దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఒప్పుకోరన్నారు మంచు విష్ణు. 'మా' ఎన్నికలు అయిన తర్వాత.. అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత... సాధారణ ఎన్నికల వైపు వెళ్లతారా? అనే ప్రశ్నకు.. తనకా ఉద్దేశం లేదన్నారు. తాను నటుడునని.. నటుడిగా సాధించాల్సింది చాలా ఉందన్నారు. ఆ దిశగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

అలాగే ‘మా’ను ఉద్ధ‌రించేందుకు కృషి చేస్తానని చెప్పారు.  యూనియన్‌లో ఉంటూ చాలా ఇష్యూస్ క్లియర్ చేయాల్సి ఉందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అయినా ప్రకాశ్‌రాజ్ ది సింగిల్ అజెండా అని.. ఆయన అసలు క్యారెక్టర్... ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిర్గతమైందన్నారు. 'అపరిచితుడు'లో విక్రమ్ క్యారెక్టర్ ప్రకాశ్‌ రాజ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు మంచు విష్ణు. ప్రకాశ్‌రాజ్ ఇగో ఏమిటంటే.. తనను సస్పెండ్ చేసిన అసోసియేషన్‌లోకే ప్రెసిడెంట్‌గా వెళ్లి... వీళ్లందరినీ శాసించాలని భావిస్తున్నారన్నారు. అలాంటి అజెండాలతో రాకూడ‌దంటూ ప్రకాశ్‌రాజ్‌కు మంచు విష్ణు హితవు పలికారు. మాలోని సమస్యలు పరిష్కరించుకోవాలని...ఏకగ్రీవంగా  ఎన్నిక కావాలని తాము భావించామని.. కానీ ఇదిగో.. ఇలా జరుగుతోందంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.