![]() |
![]() |

అనేకమంది అభిమానుల హృదయాలను బద్దలుచేస్తూ తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామనీ, స్నేహితులుగా కొనసాగుతామనీ నాగచైతన్య, సమంత ప్రకటించారు. విడాకుల నిర్ణయం మొదటగా తీసుకున్నది చైతూనే కాబట్టి, భరణం కింద సమంతకు భారీ మొత్తంలో అతను చెల్లించనున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేదనీ, చైతూ నుంచి సమంత భరణం కోరడం లేదనీ మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా కోర్టులో విడాకులు మంజూరయ్యేటప్పుడు భరణం విషయంలో నిజమెంత ఉందనేది తెలుస్తుంది. అంతదాకా ఈ వ్యవహారంలో రూమర్స్ తప్పవు.
కాగా సమంత ఎక్కడ నివాసం ఉండబోతోందనేది కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫాలోయర్స్‌తో ముచ్చటించిన సందర్భంగా, తనెక్కడికీ వెళ్లననీ, తనకు అన్నీ ఇచ్చిన హైదరాబాద్‌లోనే ఉంటాననీ సమంత క్లారిటీ ఇచ్చింది. దాన్ని బట్టి ప్రచారంలో ఉన్నట్లు ఆమె ముంబై వెళ్లదనేది తేలిపోయింది.
నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఏ ఇంట్లో తను నాగచైతన్యతో కలిసి ఉంటున్నదో, ఇకముందు కూడా అదే ఇంట్లో సమంత ఉండబోతోందని సమాచారం. పెళ్లయ్యాక గచ్చీబౌలిలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొని, అందులోనే ఉంటూ వచ్చారు చై-సామ్. ఆ అపార్ట్‌మెంట్ సమంత పేరిటే రిజిస్టర్ అయివుంది. రెండు నెలల క్రితమే చైతూ ఆ అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చేసి, తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లిపోయాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో తన రెండు కుక్కలు హ్యాష్, సాషాలతో రోజులు గడిపేందుకు సామ్ రెడీ అయ్యింది.
మరోవైపు కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసేందుకు కూడా సమంత ఇంటరెస్ట్ చూపుతోంది. ఇటీవలే గుణశేఖర్ మైథలాజికల్ ఫిల్మ్ 'శాకుంతలం' షూటింగ్‌ను ఆమె కంప్లీట్ చేసింది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో 'కాదు వాకుల రెండు కాదల్' మూవీని చేస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టులు వినే పనిలో బిజీగా ఉంటోంది సమంత. త్వరలోనే ఆమె చేయబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఏమిటనేది వెల్లడి కావచ్చు.
![]() |
![]() |