![]() |
![]() |

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట 'అల్లిపూల వెన్నెల'ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ విడుదల చేశారు. ఈ పాటకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించడం విశేషం.
తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బతుకుమ్మ వస్తుందంటే కళాకారులు కొత్త కొత్త పాటలతో అలరిస్తుంటారు. అయితే ఈసారి బతుకమ్మ పాట కోసం తెలంగాణ జాగృతి దిగ్గజాలను రంగంలోకి దింపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పాటకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. ఉత్తర ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా.. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.
బతుకమ్మ పాట 'అల్లిపూల వెన్నెల' ను మంగళవారం దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ పాటను ట్విట్టర్ లో షేర్ చేసిన రెహమాన్ 'బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేయడం విశేషం.
![]() |
![]() |