![]() |
![]() |

`స్టూడెంట్ నెం:1`(2001), `సింహాద్రి`(2003), `యమదొంగ`(2007).. ఇలా జట్టుకట్టిన ప్రతీసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి. కట్ చేస్తే.. 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే.. `ఆర్ ఆర్ ఆర్`. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తారక్ తో ఎప్పుడు సినిమా తీసినా జక్కన్న ఓ ఫార్ములాని మాత్రం ఫాలో అవుతున్నారు. అదేమిటంటే.. ఎన్టీఆర్ తో అంతవరకు నటించని నాయికలనే పెయిర్ గా ఎంపిక చేయడం. `స్టూడెంట్ నెం:1`లో గజాలాతో తారక్ తొలిసారిగా కలిసి నటిస్తే.. `సింహాద్రి`లో భూమిక, అంకితతో మొదటిసారిగా జోడీ కట్టారు. ఇక `యమదొంగ`లోనూ ప్రియమణి, మమతా మోహన్ దాస్ తో ఫస్ట్ టైమ్ ఆడిపాడారు. ఈ క్రమంలోనే.. తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`లో ఓలివియా మోరీస్ తో రొమాన్స్ చేస్తున్నారు. మరి.. గత మూడు సందర్భాల్లోనూ కలిసొచ్చిన `ఫ్రెష్ కాంబినేషన్` ఫ్యాక్టర్.. నాలుగోసారీ కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |