![]() |
![]() |

`శ్రీమంతుడు`(2015) వంటి సెన్సేషనల్ హిట్ తో నిర్మాణ రంగంలో తొలి అడుగేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఆపై `జనతా గ్యారేజ్` (2016), `రంగస్థలం` (2018) చిత్రాలతోనూ ఆ పరంపరని కొనసాగించి `హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్` నిర్మాణ సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆయా సినిమాలతో ఆయా కథానాయకులకు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ అందించి వార్తల్లో నిలిచింది. అయితే ఆ తరువాత వచ్చిన `సవ్యసాచి` (2018), `అమర్ అక్బర్ ఆంటొని` (2018) నిరాశపరిచినా `చిత్రలహరి`(2019) రూపంలో చెప్పుకోదగ్గ విజయం దక్కింది. మళ్ళీ `డియర్ కామ్రేడ్` (2019), నాని `గ్యాంగ్ లీడర్` (2019)తో ట్రాక్ తప్పిన మైత్రీకి.. `మత్తు వదలరా` (2019), `ఉప్పెన` (2021) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కాయి.
ప్రస్తుతం మైత్రీ సంస్థలో `పుష్ప`, `సర్కారు వారి పాట`, `అంటే.. సుందరానికీ!` చిత్రాలు తెరకెక్కుతుండగా.. త్వరలో MEGA 154 (బాబీ డైరెక్టోరియల్), NBK 107 (గోపీచంద్ డైరెక్టోరియల్), `భవదీయుడు..! భగత్ సింగ్`, NTR 30 (ప్రశాంత్ నీల్) వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మైత్రీ నిర్మించిన చిత్రాలుగానీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు గానీ.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్స్ కానీ స్ట్రయిట్ పిక్చర్స్ నే కావడం విశేషం. ఇంతవరకు రీమేక్స్ జోలికే వెళ్ళకుండా ఓ స్పెషల్ ట్రాక్ లో ముందుకు సాగుతున్న ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్.. మున్ముందు కూడా అదే దారిలోనే వెళుతుందేమో చూడాలి మరి!
![]() |
![]() |