Home

»

Latest News

2022 సంక్రాంతి.. ద‌ర్శ‌కులంద‌రికీ ఫ‌స్ట్ టైమ్!

Oct 1, 2021 11:00AM

2022 సంక్రాంతికి ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టించిన `భీమ్లా నాయ‌క్` విడుద‌ల కానుండ‌గా.. జ‌న‌వ‌రి 13న సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` సంద‌డి చేయ‌నుంది. ఇక జ‌న‌వ‌రి 14న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `రాధే శ్యామ్` థియేట‌ర్స్ లో ఎంట‌ర్టైన్ చేయ‌బోతోంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ప‌వ‌న్, మ‌హేశ్, ప్ర‌భాస్ ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ముగ్గుల పండ‌క్కి మురిపించ‌గా.. ఆయా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుల‌కు మాత్రం అదే మొద‌టి సంక్రాంతి కానుంది. `భీమ్లా నాయ‌క్` కెప్టెన్ సాగ‌ర్ చంద్ర గానీ, `స‌ర్కారు వారి పాట‌` డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ గానీ.. `రాధే శ్యామ్` నిర్దేశ‌కుడు `జిల్` రాధాకృష్ణ కానీ ఇప్ప‌టివ‌ర‌కు పొంగ‌ల్ సీజ‌న్స్ లో ప‌ల‌క‌రించిన సంద‌ర్భం లేదు. సో.. ఈ ముగ్గురికీ కూడా 2022 సంక్రాంతి స్పెష‌ల్ అన్న‌మాట‌. మ‌రి.. సంక్రాంతి సీజ‌న్ లో ఫ‌స్ట్ టైమ్ ఎంట‌ర్టైన్ చేయ‌నున్న ఈ ద‌ర్శ‌క‌త్ర‌యానికి ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com