![]() |
![]() |

సీనియర్ స్టార్స్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. త్వరలో సీక్వెల్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 2014 నాటి వెంకీ `దృశ్యం`కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా తెరకెక్కిన `దృశ్యం 2` త్వరలో జనం ముందుకు రాబోతుండగా.. 2016 నాటి నాగ్ సంక్రాంతి సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందుతున్న `బంగార్రాజు` వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ రీమేక్స్ సంబంధించిన ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ తమ ఎవర్ గ్రీన్ `హిట్ పెయిర్`తోనూ నాగ్, వెంకీ జట్టుకట్టడం.
ఆ వివరాల్లోకి వెళితే.. `సంకీర్తన` నుండి `సోగ్గాడే చిన్ని నాయనా` వరకు నాగ్ పక్కన నాయికగానే కనువిందు చేస్తూ వస్తున్న వెర్సటైల్ యాక్ట్రస్ రమ్యకృష్ణ.. `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ `బంగార్రాజు`లోనూ అతనికి జోడీగా నటిస్తోంది. ఇక `చంటి` నుండి `దృశ్యం` వరకు వెంకీ సరసన నాయికగానే మెస్మరైజ్ చేస్తూ వస్తున్న వెటరన్ యాక్ట్రస్ మీనా.. `దృశ్యం` సీక్వెల్ `దృశ్యం 2`లోనూ జంటగా నటించింది. మరి.. ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్స్ సమేతంగా నాగ్, వెంకీ నుంచి రాబోతున్న ఈ పర్ఫెక్ట్ సీక్వెల్స్.. తొలి భాగాల్లాగే విజయకేతనం ఎగురవేస్తాయేమో చూడాలి.
![]() |
![]() |