![]() |
![]() |

అక్కినేని అఖిల్, పూజా హెడ్గే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. లవ్, కామెడీతో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ట్రైలర్ ను మూవీ టీమ్ గురువారం సాయంత్రం విడుదల చేసింది. "మన లైఫ్ పార్టనర్‌తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు" అంటూ పూజా చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ఈ ట్రైలర్ లో 'మారీడ్ లైఫ్ బాగుండాలంటే.. కెరీర్ బాగుండాలి' అనుకునే అఖిల్.. తన లైఫ్ పార్టనర్ ని వెతికే పనిలో ఉన్నాడు. పెళ్లి మీద క్లారిటీ ఉన్న అబ్బాయి, పెళ్లి మీద కామెడీ చేసే అమ్మాయి మధ్య జరిగే రొమాంటిక్ కామెడీ స్టొరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక 'జాతిరత్నాలు' సినిమాలో చిట్టి గా అలరించిన ఫరియా అబ్దుల్లా ఈ ట్రైలర్ లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొదటి మూడు సినిమాలతో(అఖిల్, హలో, మిస్టర్ మజ్ను) విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తోనైనా ఫస్ట్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. మరోవైపు గత కొన్నేళ్ళుగా సరైన హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో అఖిల్, భాస్కర్ లు విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |