![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ సరసన కనువిందు చేసిన నాయికల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో.. `లక్ష్మీ`, `తులసి` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత రూపొందిన సినిమా `బాబు బంగారం`. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించాడు.
ఏసీపీ కృష్ణ (వెంకటేశ్) జాలి గుణం ఉన్న పోలీసాఫీసర్. తన కారణంగా నేరం చేసిన వాళ్ళు కూడా బాధపడకూడదని ఆలోచించే వ్యక్తి. అలాంటి కృష్ణ జీవితంలోకి శైలజ (నయనతార) ఎంటర్ అవుతుంది. ఆమె కుటుంబ సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుతూ దగ్గరవుతాడు కృష్ణ. అయితే, శైలజకి కృష్ణ దగ్గరవడంలో అసలు కారణం మరొకటుంటుంది. అదేంటి? చివరకు కృష్ణ, శైలజ ఒక్కటయ్యారా? లేదా అన్నది మిగిలిన సినిమా. సింపుల్ స్టోరీలైనే అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా సినిమాని రూపొందించాడు మారుతి. వెంకీ, నయన్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవగా.. సంపత్ రాజ్, బ్రహ్మానందం, పోసాని, మురళీ శర్మ, జయప్రకాశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, షావుకారు జానకి, పృథ్వీరాజ్, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
జిబ్రాన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``మల్లెల వాన``, టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి `డార్లింగ్` స్వామి సంభాషణలు అందించారు. 2016 ఆగస్టు 12న విడుదలైన `బాబు బంగారం`.. నేటితో ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |