![]() |
![]() |
.jpg)
భూమిక అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. కుందనపు బొమ్మలా క్యూట్‌గా కనిపించే భూమిక.. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా చక్కని పాత్రలు చేశారు. ఖుషి సినిమాలో నడుము మీద కెమెరా ఫోకస్ చేసినా, ఆ సీన్ ఎంత అందంగా వచ్చిందీ, సినిమాకు ఎలా హైలైట్ అయ్యిందీ మనకు తెలుసు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా టాప్ హీరోలతో నటించిన భూమికకు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా యోగా గురు భరత్ ఠాకూర్‌ను ఆమె పెళ్లాడారు.
పెళ్లి ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సినిమా కెరీర్‌పై పెను ప్రభావాన్నే చూపింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అక్క, వదిన లాంటి పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు.
రీసెంట్‌గా భూమిక షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎక్కడ్నుంచో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆమె, తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ను కలుసుకున్నారు. అందూ ఆడవాళ్లే. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అయితే అందరి చేతుల్లోనూ మందు గ్లాసులున్నాయి! అందరూ లేడీస్.. అందులో భూమిక కూడా గ్లాస్ పట్టుకొని ఉన్నారు. "Back to the city and start meeting family and friends here" అని ఆ ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు భూమిక. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

![]() |
![]() |