![]() |
![]() |

`ఇస్మార్ట్ శంకర్` (2019)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఆయన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో `లైగర్` చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది. సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. త్వరలో మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ 55వ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్ 28న `లైగర్` టీజర్ ని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. అన్ని భాషల్లోనూ టీజర్ ని రిలీజ్ చేయాలని పూరీ అండ్ టీమ్ స్కెచ్ వేసిందట. అంతేకాదు.. ఈ లోపు ఓ గ్లింప్స్ తోనో లేదంటే మోషన్ పోస్టర్ తోనో పలకరించే దిశగా `లైగర్` చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే `లైగర్` టీజర్ పై క్లారిటీ రానుంది. మరి.. పూరి - విజయ్ ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న `లైగర్`.. నేషనల్ వైడ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, `లైగర్`లో రోనిత్ రాయ్, అలీ, మకరంద్ దేశ్ పాడే, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కరణ్ జోహార్ - ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |