![]() |
![]() |

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి, యాంకర్ గాయత్రి భార్గవి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాయత్రి ఫిర్యాదు పై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ.. గాయత్రికి ఫేస్ బుక్‌లో ఓ పర్సనల్ అకౌంట్‌తో పాటు, ఆమె పేరుతో ప్రత్యేకంగా పేజీ కూడా ఉందని చెప్పారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి.. వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన మెసేజ్ లను పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ పేర్కొన్నారు.
సోషల్ మీడియా వాడుతున్న వారు ఎప్పటికప్పుడు తమ పాప్ వర్డ్స్‌ను మార్చుతూ ఉండాలనీ.. పబ్లిక్ వైఫైలను వాడకూడదని నిఫుణులు సూచిస్తున్నారు.
![]() |
![]() |