![]() |
![]() |
.jpg)
ప్రస్తుతం తెలుగునాట పూజా హెగ్డే హవా నడుస్తోంది. అందుకే.. స్టార్ హీరోలు పదే పదే ఆమెతో జతకట్టేందుకు వెనుకాడడం లేదు. తాజాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా `మహర్షి` (2019) తరువాత మరోసారి పూజతో జోడీకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ నటించనున్న కొత్త సినిమాలో లీడ్ లేడీగా పూజ ఎంపికైంది. మహేశ్ కంటే ముందే మరో ముగ్గురు హీరోలు పూజకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ హీరోలెవరంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ః
`డీజే` (2017)లో పూజా హెగ్డేతో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు బన్నీ. బాక్సాఫీస్ ముంగిట మంచి వసూళ్ళనే రాబట్టిన ఈ చిత్రం తరువాత `అల వైకుంఠపురములో` (2020) కోసం పూజకి మరోసారి ఛాన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకుంది పూజ.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ః
తన తొలి చిత్రం `ముకుంద` (2014)లో పూజా హెగ్డేతో జట్టుకట్టాడు వరుణ్. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత ఈ ఇద్దరి కలయికలో `గద్దలకొండ గణేశ్` (2019) తెరకెక్కింది. మొదటి ప్రయత్నం బెడిసి కొట్టినా.. సెకండ్ జాయింట్ వెంచర్ ఈ పెయిర్ కి వర్కవుట్ అయింది. అలా.. పూజకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వరుణ్ కి బాగానే ప్లస్ అయ్యింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ః
చరణ్ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ `రంగస్థలం` (2018)లో ``జిగేల్ రాణి``గా ఓ పాట కోసం తన అందాలతో కనువిందు చేసి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది పూజా హెగ్డే. అందుకే.. `ఆచార్య` కోసం మరోసారి పూజతో జట్టుకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ చరణ్. విశేషమేమిటంటే.. ఇందులో కూడా చరణ్ తో సింగిల్ సాంగ్ కే పరిమితమైన పాత్రలో ఎంటర్టైన్ చేయనుంది పూజ. త్వరలోనే `ఆచార్య` థియేటర్స్ లోకి రానుంది.
మరి.. మున్ముందు పూజకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన జాబితాలో ఇంకెంతమంది హీరోలు చేరుతారో చూడాలి.
![]() |
![]() |