![]() |
![]() |

తమిళనాట ఘనవిజయం సాధించిన `విక్రమ్ వేద`(2017).. హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాతృకకి దర్శకత్వం వహించిన పుష్కర్ - గాయత్రి దంపతులు.. బాలీవుడ్ వెర్షన్ ని కూడా రూపొందిస్తున్నారు. మాధవన్ పోషించిన కాప్ క్యారెక్టర్ విక్రమ్ ని సైఫ్ అలీఖాన్ రీప్లేస్ చేస్తుండగా.. విజయ్ సేతుపతి ధరించిన గ్యాంగ్ స్టర్ వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నారు. మరో రెండు నెలల్లో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. బ్లాక్ బస్టర్ మూవీ `లెజెండ్`లో నటసింహ నందమూరి బాలకృష్ణకి జోడీగా నటించిన రాధికా ఆప్టే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికైందని సమాచారం. ఈ రీమేక్ లో పోలీస్ అధికారికి భార్యగా, గ్యాంగ్ స్టర్ కి లాయర్ గా వ్యవహరించే పాత్రకి రాధికా ఆప్టే అయితేనే యాప్ట్ గా ఉంటుందని దర్శకద్వయం భావించి ఆమెని ఎంపిక చేసుకున్నారని వినికిడి. త్వరలోనే `విక్రమ్ వేద` రీమేక్ లో రాధికా ఆప్టే ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. హిందీలో పలు వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నటిగా మెప్పించిన రాధిక.. ఈ లాయర్ వేషంలో ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
కాగా, 2022 సెప్టెంబర్ లో `విక్రమ్ వేద` హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది.
![]() |
![]() |