![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కో-బ్రదర్స్ గా సందడి చేసిన `ఎఫ్ 2` ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 సంక్రాంతికి ``అంతేగా.. అంతేగా..`` అంటూ బాక్సాఫీస్ ని షేక్ చేసేశారు వెంకీ, వరుణ్. కట్ చేస్తే.. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. `ఎఫ్ 2` కెప్టెన్ అనిల్ రావిపూడి నిర్దేశకత్వంలోనే రూపొందుతున్న ఈ కొనసాగింపు చిత్రంలో వెంకీకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, వరుణ్ కి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ కంటిన్యూ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా, తాజాగా ఈ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. జంధ్యాల రూపొందించిన `అహ నా పెళ్ళంట` (1987)లో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు పోషించిన పిసినారి లక్ష్మీపతి పాత్ర తరహాలో సునీల్ క్యారెక్టర్ ఉంటుందట. ఈ రోల్ `ఎఫ్ 3` హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే `ఎఫ్ 3` విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే.
చిత్రీకరణ తుదిదశలో ఉన్న `ఎఫ్ 3`ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |