![]() |
![]() |

'బిగ్ బాస్' తెలుగు సీజన్ 5లో 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కంటెస్టెంట్‌గా పాల్గొనబోతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఆమెకు సినిమాల్లో ఆశించిన రీతిలో ఆఫర్లు లేవనీ, అందుకనే 'బిగ్ బాస్'లోకి రావాలని అనుకుంటోందనేది ఆ ప్రచార సారాంశం. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే, ఆ గ్లామర్ వేరే లెవల్లో ఉంటుందని కూడా కొంతమంది రాశారు.
అయితే ఈ ప్రచారాన్ని పాయల్ తోసిపుచ్చింది. తాను ఆ షోలో భాగం కావట్లేదని తేల్చేసింది. "అది ఫేక్ న్యూస్. వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అలాంటి రూమర్స్‌ను తేవద్దు." అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.. ఈ 'డిస్కో రాజా' హీరోయిన్. దాంతో ఆమె ఫ్యాన్స్ పలువురు ఆమె ఆ షో చేయట్లేదనే విషయం స్పష్టమై, ఆమెకు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆది సాయికుమార్ సరసన 'కిరాతక'లో నాయికగా నటిస్తోంది పాయల్.
'బిగ్ బాస్' విషయానికి వస్తే త్వరలో సీజన్ 5ను స్టార్ట్ చేయడానికి స్టార్ మా యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున ఐదో సీజన్‌నూ నడిపించనున్నారు.
![]() |
![]() |