![]() |
![]() |

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఇప్పటికే సుధీర్ హీరోగా రెండు సినిమాలు రూపొందుతున్నాయి. కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్', ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. తాజాగా ఆయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
తన కొత్త సినిమా గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన సుధీర్ బాబు.. "నా సినీ జర్నీలో ఈ సినిమాలో ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. ఇప్పటి వరకు చేయని పాత్ర చేయబోతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. ఏషియన్ సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అమృతం సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. గుండె జారి గల్లంతయ్యిందే, మనం వంటి హిట్ సినిమాలకు రచయితగా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన గతంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేయగా.. అది ఇంకా విడుదల కాలేదు. నటుడిగా, రచయితగా సక్సెస్ అయిన హర్షవర్ధన్.. దర్శకుడిగా ఎలా రాణిస్తాడో చూడాలి.
![]() |
![]() |