![]() |
![]() |

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రవితేజ 68వ సినిమాగా వస్తున్న దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీలో రవితేజ లుక్ తో పాటుగా టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్.
రవితేజ 68వ సినిమాకు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా మేకర్స్ టైటిల్ ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపించనున్నారని.. అందుకే ఈ సినిమాకి 'ఎమ్మార్వో' అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటంతో మూవీ టీమ్ ఈ టైటిల్ నే ఫిక్స్ చేసింది అంటున్నారు.

ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రవితేజ- డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న 'ఖిలాడి' మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
![]() |
![]() |