![]() |
![]() |

దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారకార్ధం ‘దాసరి నారాయణరావు ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్’ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే 'దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్' ఏర్పాటు చేసిన ఆయన.. వివిధ భాషలకు చెందిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు(లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నట్లు చెప్పారు.
దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు.. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా త్వరలో 'దాసరి బయోపిక్' నిర్మించబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ బయోపిక్ పేరు 'దర్శకరత్న'. ధవళ సత్యం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని.. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చిందని రమేష్ నాయుడు అన్నారు. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'దర్శకరత్న' బయోపిక్‌లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారని తెలిపారు.
దాసరి బయోపిక్ 'దర్శకరత్న'లో దాసరి పాత్రలో మోహన్ బాబు నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దాసరిని మోహన్ బాబు గురువుగా భావిస్తుంటారు.. తనకి సినిమా జీవితాన్ని ఇచ్చింది దాసరే అని చెబుతుంటారు. అందుకే దాసరి పాత్రలో మోహన్ బాబు నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
![]() |
![]() |