![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం `అల వైకుంఠపురములో`. అందులో అప్పలనాయుడుగా ప్రతినాయకుడి పాత్రలో అలరించాడు కోలీవుడ్ కెప్టెన్, యాక్టర్ సముద్రకని. ఆపై మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `క్రాక్`లో కఠారి కృష్ణగా మరోసారి విలనిజం పండించాడు. ప్రస్తుతం సముద్రకని.. `ఆర్ ఆర్ ఆర్`, `ఆకాశవాణి` వంటి తెలుగు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా సముద్రకనికి మరో బిగ్ టికెట్ ఫిల్మ్ లో విలన్ గా నటించే అవకాశం దక్కిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా `సర్కారు వారి పాట` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో సముద్రకని బ్యాడీగా కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే `సర్కారు వారి పాట`లో సముద్రకని ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. బన్నీ, రవితేజకి కలిసొచ్చిన సముద్రకని విలనిజం మహేశ్ కి కూడా అచ్చొస్తుందేమో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తుండగా.. తమన్ బాణీలు అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి `సర్కారు వారి పాట` జనం ముందుకు రానుంది.
![]() |
![]() |