![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. కొత్త సినిమా `ఏజెంట్`పైనే ఫోకస్ చేస్తున్నాడు అఖిల్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. దాదాపు రూ.3 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. `ఏజెంట్`లో మమ్ముట్టి ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు? అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అఖిల్ కి గురువు తరహా పాత్రలో మమ్ముట్టి దర్శనమివ్వనున్నాడట. ఈ క్యారెక్టర్ ని సూరి డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుందని వినికిడి. త్వరలోనే `ఏజెంట్`లో మమ్ముట్టి ఎంట్రీ, రోల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `ఏజెంట్`లో అఖిల్ కి జంటగా నూతన కథానాయిక సాక్షి వైద్య నటించనుండగా.. యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందించనున్నాడు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |