![]() |
![]() |

త్రిష, ఇలియానా, సమంత, రష్మిక మందన్న, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్.. ఇలా తన కెరీర్ క్లిష్ట దశలో ఉన్న సమయంలోనూ పలువురు స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు యూత్ స్టార్ నితిన్. ఈ క్రమంలోనే.. మరో స్టార్ బ్యూటీతో జట్టుకట్టనున్నాడట ఈ యంగ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాలో నితిన్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే సందడి చేయనుందట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని వినికిడి. త్వరలోనే నితిన్, పూజా హెగ్డే జోడీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో` చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` రిలీజ్ కి రెడీ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న `రాధే శ్యామ్` చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ `బీస్ట్`లోనూ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రంలోనూ పూజనే నాయిక.
![]() |
![]() |