![]() |
![]() |

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం 'వాలిమై'. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ మూవీ పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా 'నేర్కొండై పార్వై' పేరుతో బోనీ కపూర్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అజిత్, వినోద్, బోనీ కపూర్ ల కాంబినేషన్ లో 'వాలిమై' వస్తోంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న 'వాలిమై' ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా ఈ మొత్తం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు 'వాలిమై' చిత్రానికి సంబంధించి ఒక్క పోస్టరు కూడా రిలీజ్ కాకమందే ఏకంగా రూ.200 కోట్ల బిజినెస్ వార్తలు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తారని, సినిమా దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
'వాలిమై' సినిమాను తెలుగు లో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ అజిత్ సరసన నటిస్తోంది. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |