![]() |
![]() |

`గబ్బర్ సింగ్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. పవన్ - హరీశ్ సెకండ్ జాయింట్ వెంచర్ ఎలాంటి కథాంశంతో తెరకెక్కనుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాకపోతే, ఇందులో పవన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు.. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అని, మరొకటి ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆఫీసర్ అని ఆ మధ్య ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పవన్ ది సింగిల్ రోల్ నే అట. కాకపోతే, రెండు కోణాలు ఉంటాయని వినికిడి. ఒక కోణంలో జోవియల్ గా ఉంటే.. మరో కోణం సీరియస్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు.. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే విధంగా కథానాయకుడి పాత్ర సాగుతుందని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, పవన్ ప్రస్తుతం `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `హరిహర వీరమల్లు`తో బిజీగా ఉన్నారు. అవి తుది దశకు చేరుకున్నాకే హరీశ్ శంకర్ కాంబో మూవీ పట్టాలెక్కనుంది.
![]() |
![]() |