![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ - అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. అలాంటి.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం `అనసూయమ్మ గారి అల్లుడు`. పొగరుబోతు అత్తకి గుణపాఠం చెప్పే ఓ అల్లుడి కథతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. ఇందులో అత్త అనసూయమ్మగా `ఊర్వశి` శారద నటించగా.. టైటిల్ రోల్ లో బాలయ్య దర్శనమిచ్చారు. బాలకృష్ణ కి జంటగా భానుప్రియ నటించిన ఈ సినిమాలో జగ్గయ్య, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, చలపతిరావు, హేమసుందర్, అన్నపూర్ణ, రమాప్రభ, డబ్బింగ్ జానకి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని పాటలన్నీ మాస్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. తమిళంలో `వైరాగ్యం` (ప్రభు, రాధ, షావుకారు జానకి) పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన `అనసూయమ్మ గారి అల్లుడు`.. 1986 జూలై 2న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ సినిమా 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |