Home

»

Latest News

స్వీటీ సినిమాలో రౌడీ హీరో?

Jul 2, 2021 2:13PM

పాతికేళ్ళ యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డే న‌ల‌భైఏళ్ళ అవివాహిత మ‌హిళ క‌థతో స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి, యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్వీటీతో `మిర్చి` (2013), `భాగ‌మ‌తి` (2018) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ మూవీస్ ని నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేయ‌నుంది. `రా రా కృష్ణ‌య్య‌` ఫేమ్ మ‌హేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. కాగా, ఈ చిత్రానికి `మిస్ శెట్టి అండ్ మిస్ట‌ర్ పోలిశెట్టి` అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. విశ్రాంతి స‌న్నివేశానికి ముందు క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే గెస్ట్ రోల్ అద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ క్యారెక్ట‌ర్ సినిమా హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే స్వీటీ - న‌వీన్ పోలిశెట్టి కాంబినేష‌న్ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `లైగ‌ర్`లో న‌టిస్తున్నాడు.  స్పోర్ట్స్ డ్రామాగా త‌యార‌వుతున్న ఈ సినిమాలో అత‌నికి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com